హొళగుంద మండలం గజ్జహళ్లి గ్రామంలో గురువారం పిడుగుపాటుకు గురై కురువ అనసూయ (28) అస్వస్థతకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనసూయ తన మిరప తోటలో పని చేస్తుండగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభం కావడంతో అక్కడే ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లింది. కాసేపటికే కొద్ది దూరంలో పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉంది.