కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో శుక్రవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. కొబ్బరి కాయలు కొట్టి గిరి ప్రదక్షణను సత్యనారాయణ స్వామి ఆలయ ఈఓ రామచంద్ర మోహన్, చైర్మన్ రోహిత్ ప్రారంభించారు. రత్న, సత్యగిరుల చుట్టూ 8.4 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ సాగింది. గిరి ప్రదక్షిణకు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు.