TG: నిర్మల్ జిల్లాలోని భైంసాలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఇందిరమ్మ సర్కార్ ఒక్కసారి మాట ఇస్తే మడమ తిప్పదని మంత్రి పొంగులేటి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఎన్నికలప్పుడే ఇదిగో డబుల్ బెడ్రూం ఇల్లులు, ఉద్యోగాలు, పెన్షన్లు అని మాయమాటలు చెప్పమని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యాడని ఆరోపించారు.