AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత.. కడప ఎస్పీ విద్యాసాగర్‌ను కలిశారు. వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా పోలీసులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపైన కూడా ఎస్పీతో చర్చించారు.