కార్తీక మాసం సందర్భంగా కొలిమిగుండ్ల మండలం కొర్నాపల్లె సమీపంలోని పురాతన గుండం ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామున స్వామీకి అభిషేకం, ఆకు పూజ చేశారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మాయిపల్లె గ్రామ ప్రజల ఆద్వర్యంలో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు.