నంద్యాలలో డాక్టర్ రాబర్ట్ కోచ్ జయంతి సందర్భంగా డిఎంహెచ్ ఓ వెంకటరమణ, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టిబి వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, టిబి వ్యాధిపై అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు.