ముఖ్యమంత్రి మాట ఇచ్చిన ప్రకారముగా సి పి యస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు నరసింహారెడ్డి, దేవపాల్, నరసింహులు డిమాండ్ చేశారు. డోన్ పట్టణంలో సుమన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఆదివారం బహిరంగసభ నిర్వహించడం జరుగుతున్నదని, హాజరు కావాలని పిలుపునిచ్చారు.