డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 18 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులపైన నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్ నాయకులు శాంతిప్రియ, నరసింహారెడ్డి, అబ్దుల్ లతీఫ్, కృష్ణా నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.