ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రబీ పంటలకు గడువులోగా ప్రీమియం చెల్లించాలని కోడుమూరు వ్యవసాయాధికారి రవిప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పప్పు, శనగ పంటకు ఎకరానికి రూ. 420, జొన్న రూ. 297, వేరుశనగ రూ. 480లు ప్రీమియం కింద చెల్లించాలన్నారు. ప్రధానంగా పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది అంటున్నారు.