కోడుమూరు: భూసమస్యలు పరిష్కరించేందుకే గ్రామసభలు: జేసీ

76చూసినవారు
రీసర్వేలో భాగంగా వచ్చిన భూసమస్యలను పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య తెలిపారు. బుధవారం గూడూరు మండలం కె. నాగలాపురంలో తహసీల్దార్ రామాంజినేయులు ఆధ్వర్యంలో రీసర్వే భూసమస్యలపై గ్రామసభ నిర్వహించి, జేసీ నవ్య రైతులతో మాట్లాడారు. సమస్యలున్న రైతులంతా ముందు కొచ్చి అర్జీలిస్తే అధికారులు వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.