కోడుమూరు: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

66చూసినవారు
కోడుమూరు: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి. కృష్ణ అన్నారు. ఆదివారం గూడూరు మండలం చనుగొండ్లలో బి. కృష్ణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శేషు కుమార్ పేదలతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామాల్లో ఉన్న వారికి 3 సెంట్లు, పట్టణాల్లో ఉన్న వారికి 2 సెంట్లు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్