ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోడుమూరు తహశీల్దార్ వెంకటేష్ నాయక్ సూచించారు. శనివారం కొత్తూరు పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటు నమోదును పరిశీలించి, మాట్లాడారు. 18 ఏళ్ళు నిండిన యువత ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో ఏవైనా పేర్లు, అడ్రసు మార్పులు, చేర్పులున్నా, మృతి చెందిన వ్యక్తుల పేర్లను తొలగించాల్సినా బీఎల్వోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.