కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లను అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేయిస్తున్నామని, ఇంజనీరింగ్ అధికారులు వేగవంతంగా పనులు చేయిస్తున్నారన్నారు. ముందుగా రెండు క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధం చేశామని, రుచికరమై భోజనం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.