ఈనెల 16, 17,18 తేదీలలో కాకినాడ జిల్లాలో అండర్ 19 ఎస్. జీ. ఎఫ్ హాకీ బాల బాలికల ఛాంపియన్షిప్ ను నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో జిల్లా జట్టు రాణించి పతకాలతో తిరిగి రావాలని కార్యదర్శి హర్షవర్ధన్, డి. ఎస్. డి. ఓ భూపతి కోరారు. శుక్రవారం జిల్లా కర్నూలు జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరేముందు వీరిరువు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ అధ్యాపకులు రియాజ్, కోచ్ మాధవ్, బాలికల మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.