ఇటీవల కర్నూలు నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా బాధ్యతలు చేపట్టిన శామ్యూల్ పాల్ ను జిల్లా ఏపీ ఎస్ఎపిఈపిఈటి సంఘం కర్నూలు జిల్లా శాఖ సభ్యులు శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సంఘం అధ్యక్షులు జోసఫ్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు డీఈఓను శాలువా కప్పి పుష్పగుచ్చంతో సన్మానించారు. లక్ష్మయ్య మాట్లాడుతూ వ్యాయమా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలని డీఈవో ను కోరారు.