కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులకు పనిచేయాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సివిల్ రైట్స్‌డే కార్యక్రమాన్ని మరింత సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. జిల్లాలోని అన్ని స్టేషన్లల్లో ఉన్న కేసుల విచారణలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.