పెద్దకడబూరులో తుఫాను కారణంగా కురిసిన గాలి వానకు చేతికి వచ్చిన వరి పంట నేలకూలింది. దీంతో రైతులు, కౌలు రైతులు ఆందోళనలో ఉన్నారు. గ్రామంలోని 76 కాలువ, ఆర్ కాలువ కింద రైతులు వరి సాగు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నామని అయితే తుఫాను కారణంగా కురిసిన గాలి వాన తమ పాలిట శాపంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.