ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు, పాల్గొన్నారు.