నంద్యాల జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్సీ, బిసి రెసిడెన్షియల్, సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.