పాణ్యం: ప్రజల నీటి కష్టాలు పట్టించుకోవడం లేదు

70చూసినవారు
పాణ్యం పట్టణంలో త్రాగునీరు లేక 5వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకుడు వనం వెంకటాద్రి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి పంచాయతీ అధికారులకు ప్రజాసంఘాల నాయకులు విన్నవించినా పట్టించుకోలేదని, ప్రజల నీటి కష్టాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్