ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని బీఎల్వోలను ఆర్డీవో భరత్ నాయక్ ఆదేశించారు. శనివారం క్రిష్ణగిరి మండలంలోని ఎరుకలచెరుడు, కంబాలపాడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసి, ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు సవరణ దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చేయాలని సిబ్బందికి సూచించారు.