సంక్షోభంలో పడిన వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందామని రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య కోరారు. ఆదివారం పత్తికొండలో నిర్వహించిన రైతుల కార్తీక వనభోజనం కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. డా. స్వామినాథన్ కమిటి సిఫారసులను అమలు చేయాలని, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలన్నారు. ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు రూ. కోట్లలో రాయితీలు ఇస్తే, బ్యాంకులు దివాలా తీయవా అని ప్రశ్నించారు.