మహానంది క్షేత్రంలో వైభవంగా ప్రదోషకాల నందీశ్వరాభిషేకం

79చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో గర్భాలయం ఎదురుగా కొలువైన నందీశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకార్చన పూజలు వైభవంగా మంగళవారం నిర్వహించారు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశి మహాప్రదోషం సందర్భంగా వేదపండితులు, అర్చకులు వేదమంత్రాలతో ప్రదోషకాలనందీశ్వరాభిషేకం, ప్రదోషకాలపూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, పుణ్యాహవాచనం, నవదేవతాధ్యానం, పీఠపూజానంతరం వివిధ సుగంధద్రవ్యాలతో అభిషేకార్చనలు, హారతి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్