కందుకూరు మండలం బలిజిపాలెంకి చెందిన దారా కళ్యాణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలిసారు. సీఎం సహాయ నిధి ద్వారా ముందుగా ఆపరేషన్ చేయించుకొనుటకు 2 లక్షల రూపాయలకు ఎమ్మెల్యే అనుమతికి మంజూరు పంపించారు. గురువారం కందుకూరులోని టిడిపి కార్యాలయంలో కళ్యాణికి కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు కాబడిన (ఎల్ఓసి)ని అందజేశారు.