కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండల కేంద్రం లో ఉన్న హై స్కూల్లో ప్రత్యేక ఆధార్ క్యాంప్ ను ప్రధానోపాధ్యాయులు పివి. రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆధార్లో తప్పులు ఉన్న విద్యార్థులు ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ను సమర్పించి అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు. తప్పులు ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు కోరారు. అలాగే ఫోటోలు కూడా మారుస్తారు.