కందుకూరులో జరుగుతున్న కందుకూరు, కావలి పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిడిఎస్యూ మాజీ రాష్ట్రనాయకులు, ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆర్. హరిబాబు, ప్రముఖ అడ్వకేట్ ఎల్.వి బ్రహ్మయ్య కోరారు. కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని వారి సంక్షేమానికి కృషి చేస్తామని పిడిఎస్యూ నేతలు తెలిపారు.