లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు గేట్లు తెరిచి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నుంచి మనకు రావాల్సిన 1.5 టిఎంసిల నీరు కూడా ప్రాజెక్టుకు వస్తుందని దీని ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంటుందని తెలిపారు.