ఈనెల 12, 13, 14 తేదీల్లో నెల్లూరు జిల్లాకు తుఫాన్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో కావలి నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళవారం కావలిలో పడిన వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి.