కావలి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు ఉభయదాతగా స్వాములకు నిత్య అన్నదానము నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులను వేడుకున్నారు. తదుపరి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో కలిసి బిక్ష గావించారు.