వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది ఏలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని మేయర్ పొట్లూరి స్రవంతి తెలియజేశారు. భారీ వర్షాల సూచనల నేపధ్యంలో కార్పొరేషన్ ఇండోర్, ఔట్ డోర్ సిబ్బంది అంతా యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్ స్పష్టం చేసారు,