వయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తెలిపారు. విజయానికి గుర్తుగా స్థానిక ఇందిరాభవన్ లో శనివారం నాయకులు కార్యకర్తలు మిఠాయిలు, బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, పిసిసి మెంబర్ బాల సుధాకర్ పాల్గొన్నారు.