నెల్లూరు జిల్లాలో మొత్తం 182 షాపులకు గాను 3872 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నెల్లూరు, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి , ఆత్మకూరు, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మండలాల్లో నూతన మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో కలెక్టర్ సమక్షంలో నేడు లాటరీలు తీయనున్నారు. దరఖాస్తుదారులు అక్కడకి చేరుకున్నారు. రెండు లక్షలు కట్టి దరఖాస్తు చేసుకోవడంతో వాటిలో టెన్షన్ నెలకొంది.