విద్యార్థులకు నగదు బహుమతులు
రాపూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల్లో ఈ ఏడాది పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీకిరెడ్డి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు శశిధర్ రెడ్డి సోమవారం నగదు బహుమతులను అందించారు. విద్యార్థి మహేష్ కు రూ. 10 వేలు, శ్రావన్ కు రూ. 5వేలు, బాలికోన్నత పాఠశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన అర్చనకు రూ. 10 వేలు, జాస్మిన్ కు రూ. 5 వేలు అందచేశారు.