Oct 24, 2024, 23:10 IST/వికారాబాద్
వికారాబాద్
దుద్యాల: చెరువుకు మరమ్మతులు చేయిస్తాం.. డీఈఈ
Oct 24, 2024, 23:10 IST
దుద్యాల మండలంలోని సండ్రకుంట తండా, నాన్యనాయక్ తండాల పరిధిలోని పిన్ కుంట చెరువుకు మరమ్మతులు చేయిస్తామని ఇరిగేషన్ శాఖ డీఈఈ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన చెరువును సందర్శించి మాట్లాడారు. తూముకు రంధ్రం ఏర్పడి చెరువులోని నీరు వృథాగా పోతుందని, చెరువు కట్టకు సైతం మరమ్మతు పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇందులో కాంగ్రెస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్, రాహుల్ ఉన్నారు.