మనుబోలులో సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

80చూసినవారు
మనుబోలులో సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఎంపీపీ గుండాల వజ్రమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశంలో కొందరు ఎంపీటీసీలు సర్పంచులు గైర్హాజరు పైన వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచులు ఎంపీటీసీలు ఈసారి జరిగే మండల మీట్లో తప్పక హాజరు కావాలని ఎంపిపి వజ్రమ్మ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్