సర్పంచ్ చొరవతో కంపచెట్లు తొలగింపు

2069చూసినవారు
సర్పంచ్ చొరవతో కంపచెట్లు తొలగింపు
నెమళ్ళదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో పొలంగారిపల్లి నుండి నెమళ్ళదిన్నె వరకు ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపుల కంప చెట్లు పెరిగి ప్రమాదకరంగా ఉండటంతో వాహదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తోకల రామచంద్ర గుర్తించి జెసిబి ఏర్పాటు చేసి సుమారు 5 కిలోమీటర్ల మీరా కంపచెట్లు తొలగించటం జరిగింది. కంప చెట్లు తొలగించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ తోకల రామచంద్ర మాట్లాడుతూ. పొలంగారిపల్లి నుండి గంధంవారిపల్లి వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి నూతన రోడ్డు ఏర్పాటు జరిగేలా చూడాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్