ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై విచారణ

78చూసినవారు
ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై విచారణ
ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం విచారణ నిర్వహించారు. విచారణ అధికారి సిద్ధ నాయక్ మాట్లాడుతూ. ఆసుపత్రిలోని నిధులు పక్కదారి పట్టినట్లు సిబ్బంది వ్యవహార శైలిపై, వైద్యాధికారుల తీరుపై ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఫిర్యాదులు వచ్చిన కారణంగా ఉదయగిరి ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్