విధి నిర్వహణలో అలసత్వం వహించిన 11మంది సచివాలయం సిబ్బందిపై వేటుపడింది. ఉదయగిరి మండలం పరిధిలోని పలు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది సిబ్బంది అలసత్వం వహించిన కారణంగా వారికి సోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. సోకాజ్ నోటీసులు అందుకున్న సిబ్బంది మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆయన తెలిపారు.