ఉదయగిరి: ఈనెల 10వ తేదీన ప్రాంతీయ మహాసభలు

68చూసినవారు
ఉదయగిరి: ఈనెల 10వ తేదీన ప్రాంతీయ మహాసభలు
నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు బుధవారం సమావేశం అయ్యారు. ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాంపురం మండలాల ప్రాంతీయ మహాసభలు ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి సమస్యల గురించి చర్చిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉదయగిరి ప్రాంత ప్రజలు అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్