నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పాలకేంద్రం సమీపంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం రావడంతో ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురు దొరకగా మరో ఐదుగురు పరారైయ్యారు. వారి దగ్గర నుండి రూ. 4000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది మీద కేసు నమోదు చేశారు.