Sep 26, 2024, 06:09 IST/
ఉత్తరప్రదేశ్లో కనిపించిన ఆరవ తోడేలు.. వీడియో వైరల్
Sep 26, 2024, 06:09 IST
ఉత్తరప్రదేశ్లో తోడేళ్ల వేట కొనసాగుతోంది. బహ్రైచ్లో ఇప్పటి వరకు ఐదు తోడేళ్లను బంధించారు. అయినా తోడేళ్ల బీభత్సం ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రాత్రి కూడా ఓ బాలికపై తోడేలు దాడి చేసింది. తాజాగా అదే ప్రాంతంలో ఆరవ తోడేలు కనిపించింది. మహ్సీలోని సికందర్పూర్ ప్రాంతంలో తోడేలు కనిపించగా స్థానికులు వీడియోలు తీశారు. ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు, మరో 60 మందికి పైగా గాయపడ్డారు.