టీడీపీ నాయకుల కొత్త కాన్సెప్ట్!
By తానూరు గోపిచంద్ 82చూసినవారుఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు కొత్త కాన్సెప్ట్‌ను తెరమీదికి తెచ్చారు. అదే.. ''మనంలో మనం!''. అంటే అందరూ కలివిడిగా ఉంటారు. ఎక్కడా వివాదాలకు పోరు. మరీ ముఖ్యంగా పెద్దాయన చంద్రబాబు వద్ద పంచాయతీలకు అసలేపోరు. తమలో తామే సర్దుకుపోతారు. కొన్ని రాజకీయపరమైన విషయాల్లో ఎక్కడా వివాదాలకు తావు లేకుండా.. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు వరకు విషయం వెళ్లకూడదని తీర్మానం చేసుకుని ముందుకు సాగుతున్నారు.