కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. స్పందించిన పవన్

67చూసినవారు
కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. స్పందించిన పవన్
కెనడాలో హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించేలా కెనడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు హిందువులపై దాడులను ఖండిస్తూ ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘ప్రపంచంలో ఏ వర్గం అణచివేతకు గురైనా, హింసకు గురైనా అచంచలమైన సంకల్పంతో ఐక్యంగా నిలబడదాం’ అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్