డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించనున్నారు. మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు కేటాయించిన 1515.93 ఎకరాల్లో అటవీ భూములు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ భూములపై పవన్ ఫోకస్ పెట్టారు. అటవీ అధికారులు సర్వే అనంతరం నివేదికను పవన్‌కు అందజేశారు. దీంతో
ఆయన భూములను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.