ఏ తల్లికయినా బిడ్డకు జన్మనివ్వడం అనే ప్రక్రియ ప్రాణాంతకంగా మారకూడదు. కానీ, గిరిజన తల్లులకు ప్రసవవేదన ప్రాణం పోయేంత దారుణంగా మారుతోంది. పురిటి నొప్పుల సమయంలో ప్రభుత్వాసుప్రతికి వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. అలాంటి స్థితిలో డోలీలో రాళ్లూ రప్పల తోవల్లో కొండలు దిగుతూ.. వాగులో నడుస్తూ వారి ప్రయాణం ఎంతో దుర్భరం. దేశంలో ఏటా 24 వేల మంది తల్లులు ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతుండగా, అందులో అత్యధికులు కొండప్రాంత నివాసితులే.