కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులు అని మాజీ శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణం అని వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని అన్నారు. అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని పేర్కొన్నారు.