తీరం దాటిన వాయుగుండం

57చూసినవారు
తీరం దాటిన వాయుగుండం
వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్