పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నానికి దక్షిణంగా 30 కి.మీ., విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కళింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటనుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.