చంద్రబాబు ఎస్సీలను ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు: రావెల

59చూసినవారు
చంద్రబాబు ఎస్సీలను ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు: రావెల
టీడీపీ చంద్రబాబు ఎస్సీలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకోవడం తప్ప, వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబూ పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో శనివారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎస్సీల్లో ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెంచినది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబుకు పెత్తందారులపై ఉన్న ప్రేమ దళితులపై లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్