
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు సోమవారం విశాఖ వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుక ఏర్పాట్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమై.. యోగా వేడుకలకు జన సమీకరణపై చర్చిస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాత్రికి విజయవాడ బయలుదేరుతారు.